![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 377 లో.. ఆదర్శ్ ఇంటికి రావడంతో అందరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. అదర్శ్ తో వాళ్ళ అమ్మ భవాని ప్రేమగా మాట్లాడుతుంది. చెప్పు కన్నా ఈ సంవత్సరం ఏం చేశావని ఆదర్శ్ ని భవాని అడుగగా.. ఏం ఉంది అమ్మ అలా ఖాళీగా గడిచిపోయిందని ఆదర్శ్ అన్నాడు. ఎందుకని జాబ్ కి రిజైన్ చేశావని భవాని అడుగగా.. ఇప్పుడు అవన్నీ ఎందుకు అమ్మ అని అదర్శ్ అంటాడు. రిస్క్ ఆపరేషన్స్ లో ఉంటానని ఆదర్శ్ అనగా పైఅధికారులు వినకుండా అడ్మినిస్ట్రేషన్ కి మార్చారంట.. అక్కడ రిస్క్ ఏం ఉండదని, అది ఇష్టం లేదని రిజైన్ చేశాడని కృష్ణ చెప్తుంది.
ఎప్పుడు రిస్క్ ఆపరేషన్స్ అంటూ వెళ్తే .. ఇంట్లో అమ్మ ఉందని అసలు గుర్తుందా అని భవాని అంటుంది. అలా అనకు అమ్మ అని ఆదర్శ్ అంటాడు. సరే రిస్క్ ఆపరేషన్స్ చేసావ్ సరే.. లాస్ట్ చేసిన ఆపరేషన్ ఏంటని మధు అడుగుతాడు. పాకిస్తాన్ బార్డర్ లో దుండగులు చొరబడకుండా నేను నాతో పాటు ముగ్గురు ఉన్నారు. వారిని బ్యాకప్ గా పెట్డి నేనొక్కడినే బార్డర్ దగ్గరికి వెళ్ళి పదే పది నిమిషాల్లో పదిమందిని చంపేసి వారిని పాకిస్తాన్ కి పంపించేశానని ఆదర్శ్ అనగానే.. ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా చప్పట్లు కొడతారు. ఇక కాసేపటికి ఆపరేషన్ పేరేంటని మధు అడుగగా.. ఆపరేషన్ ముకుంద అని ఆదర్శ్ అంటాడు.ఇక అది విని అందరు సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతారు. భార్య పేరుని మిలటరీ ఆపరేషన్ కి పెట్టిన మొట్టమొదటి భర్తవి నువ్వేరా.. హ్యాట్సాఫ్ అని మురారి అంటాడు. ముకుందకి ఆదర్శ్ కి ఉన్న ప్రేమకి ఇదే నిదర్శనం అక్క.. ఇంకెందుకు ఆలస్యం. ముహుర్తాలు పెట్టిద్దామని భవానీతో రేవతి అనగానే.. భవాని సరేనని అంటుంది. మరుసటి రోజు ఉదయం.. భవాని హాల్లో కూర్చుంటుంది. అక్కడికి రేవతి వచ్చి కాఫీ ఇస్తుంది. కాఫీ తీసుకున్న భవానీ రేవతిని చూసి.. ఈ రోజు బాగున్నావని అంటుంది. ఇప్పుడు మీరు బాగున్నారు కాబట్టి నేను కూడా బాగా కన్పిస్తున్నానని రేవతి అంటుంది.
కృష్ణ, ముకుంద కలిసి తులసికోట చుట్టు తిరుగుతూ ఉంటారు. అది చూసి రేవతి సంతోషపడుతుంది. ఈ క్షణం ఇలా ఉంటే బాగుంటుందని రేవతి అనగా.. అలా ఎప్పుడు అనుకోకూడదని భవాని అంటుంది. కాసేపటికి కృష్ణ, ముకుంద పూజ చేసి హారతి ఇస్తుంటారు. భవానీ దగ్గరకి ముకుంద వచ్చి హారతి ఇస్తుండగా మొదటగా వద్దన్నట్టున్నా తర్వాత తీసుకుంటుంది. కృష్ణ తన హారతి కూడా తీసుకోమని అనగా.. మళ్లీ తింగరి పిల్ల అనిపించుకున్నావని భవానీ అంటుంది. ఆ తర్వాత పంతులు కోసం రేవతి, నందు ఎదురుచూస్తుంటారు. అప్పుడే మధు వచ్చి.. ఎందుకు అలా ఉన్నారు పెద్దమ్మ అని రేవతి అనగానే.. మహుర్తాలు పెట్టడానికి పంతులు గారు వస్తున్నాని చెప్పారు . అందుకే వెయిటింగ్ అని రేవతి, నందు అంటారు. తరువాయి భాగంలో ముకుంద బయట నిల్చొని ఆలోచిస్తుంటుంది. అప్పుడే తన దగ్గరకి ఆదర్శ్ వచ్చి పట్టుకుంటాడు. దాంతో ముకుంద భయపడి అరిచేస్తుంది. అది విని ఇంట్లోని వారంతా అక్కడికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |